కమాన్పూర్, మార్చి 17: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తూ కాలం గడుపుతుందని మండల బీఆర్ఎస్ నాయకులు అన్నారు. అందుకే రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజా పాలన కాదు, ఇది దగాకోరు ప్రభుత్వమని విమర్శించారు. కమాన్పూర్ ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ నుంచి అకారణంగా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం సరైంది కాదన్నారు. కేటీఆర్, జగదీష్ రెడ్దిల దిష్టి బొమ్మలను దహనం చేసిన ఘటనపై పోలీసుల దృష్టికి తీసుకెళ్తే.. అధికార పార్టీ నాయకులకే వత్తాసు పలికారని ఆరోపించారు.
దిష్టి బొమ్మలు దహనం చేస్తే అదే ప్రతిపక్ష పార్టీలపైన మాత్రం కేసులు పెట్టినట్లు అధికార పార్టీ పై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. జూలపల్లిలో ఓ మహిళను కాంగ్రెస్ నాయకులు దూషించినా పట్టించుకోలేదన్నారు. చట్టం అధికార పార్టీకి చుట్టంగా మారితే ప్రజా స్వామ్యంలో సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందా అని నిలదీశారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ తాటికొండ శంకర్, యూత్ మండల అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు పొన్నం రాజేశ్వరి, జూలపల్లి, సిద్దిపల్లె మాజీ ఉప సర్పంచులు పోలుదాసరి సాయి కుమార్, జాబు సతీష్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, నాయకులు నీలం శ్రీనివాస్, తోడేటి రాజీర్, గుర్రం శంకర్, పొట్ల శంకర్, ఎలబోయిన రామ్మూర్తి పాల్గొన్నారు.