ఓదెల, జూలై 4: పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రూప్ నారాయణపేట గ్రామానికి చెందిన రాపర్తి రాజు(35) అనే యువకుడు ఓదెల నుంచి పెగడపల్లి వైపు బైక్ పై వెళుతున్నాడు. అదే క్రమంలో ఓదెల నుంచి పెగడపల్లికి వెళ్తున్న లారీ బైకును వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. మృతుడికి భార్య శిరీష, ఇద్దరు చిన్నారి కుమారులు ఉన్నారు. యువకుడి మృతితో స్వగ్రామం రూపు నారాయణపేట గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.