Ration Rice | 72 కిలోలకు 4 కిలోలు తగ్గింది.. రేషన్ డీలర్‌ను నిలదీసిన లబ్ధిదారులు.. వీడియో
Ration Rice | రేషన్ డీలర్లు లబ్దిదారులను ఏ మార్చి తూకంలో తరుగు తీస్తున్న సంఘటన రామగుండం నగర పాలక సంస్థ 41వ డివిజన్ జవహర్ నగర్ లో ఆలస్యంగా వెలుగుచూసింది.
Ration Rice | కోల్ సిటీ, ఏప్రిల్ 8: రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ డీలర్లకు కలిసి వస్తోంది. రేషన్ డీలర్లు లబ్దిదారులను ఏ మార్చి తూకంలో తరుగు తీస్తున్న సంఘటన రామగుండం నగర పాలక సంస్థ 41వ డివిజన్ జవహర్ నగర్ లో ఆలస్యంగా వెలుగుచూసింది.
సదరు రేషన్ దుకాణంలో ఓ లబ్దిదారుడు రణధీరకు మూడు నెలల బియ్యం 72 కిలోలు పోశారు. అనుమానం వచ్చిన సదరు లబ్దిదారుడు ఆ బియ్యం తీసుకవెళ్లి పక్కనే ఉన్న కిరాణం దుకాణంలో సరి చూసుకోగా, 68 కిలోలుగా చూపించింది. దీంతో ఖంగుతిన్న లబ్దిదారుడు మళ్లీ రేషన్ దుకాణానికు వచ్చి డీలర్‌ను ప్రశ్నించగా, కంప్యూటర్ కాంటా అట్లనే చూపిస్తుందంటూ దాటవేసే ప్రయత్నం చేయడంతో అక్కడే ఉన్న లబ్దిదారులు డీలర్‌తో వాగ్వాదానికి దిగారు.
ఒక్కో కార్డుకు 4 కిలోల చొప్పున తరుగు తీస్తే, డివిజన్లో సుమారు 2 వేల మంది కార్డుదారులు ఉంటే ఎంత బియ్యం తరుగు తీస్తున్నావంటూ నిలదీశారు. దీనితో కొద్ది సేపు లబ్ధిదారులకు, డీలర్‌కు మధ్య గొడవ జరిగింది. ఐతే తూకం వేసే సందర్భంలో అప్పుడప్పుడు జంప్ అవుతుందని, మళ్ళీ సరి చేస్తానని డీలర్ తప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడంతో చివరకు సదరు లబ్ధిదారుడు తన బియ్యాన్ని దుకాణంలోనే వదిలివెళ్లిపోతూ.. ఈ తతంగమంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
డీలర్ల చేతివాటం..
రేషన్ బియ్యం పంపిణీలో దగా జరుగుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు, ఇదేం రేవంత్ పాలన అంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ఆసరా చేసుకొని పారిశ్రామిక ప్రాంతంలోని పలువురు డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఒక్కో లబ్ధిదారుడికి 70 నుంచి క్వింటాల్ వరకు బియ్యం పోయాల్సి వస్తుండటంతో డీలర్లు బియ్యానికి బదులుగా కిలోకు రూ.12 చొప్పున నగదు చెల్లించి బియ్యంను పక్కదారి పట్టిస్తున్నారు. ఉన్నతాధికారులు నిరంతర తనిఖీలు చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
రేషన్ డీలర్‌తో లబ్ధిదారుల వాగ్వివాదం..
Read Also :
US-Iran ceasefire | ఇరాన్-అమెరికా కాల్పుల విరమణపై స్పందించిన ఇండియా.. ఏం చెప్పిందంటే
ACB Raid | రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్
Allu arjun | ఐకాన్ స్టార్‌కు గీతా ఆర్ట్స్ స్పెషల్ గిఫ్ట్.. అదిరిపోయే బర్త్‌డే మ్యాషప్ వీడియో
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

