గోదావరిఖని, ఏప్రిల్ 15: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఆటో యూనియన్ పరిధి వివిధ అడ్డాల నాయకులు, సభ్యులు రూ.50వేల విరాళాన్ని ప్రకటించారు. మంగళవారం గోదావరిఖని పట్టణంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు నగదును అందజేశారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లను కడుపులోకి పెట్టుకోని కాపాడారని, అండగా నిలిచారని కొనియాడారు.
కాంగ్రెస్ పాలనలో ఆటోవాలాల పరిస్థితి ఆగమైందని, బతుకులు రోడ్డున పడ్డాయన్నారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక్కడ నాయకులు నీలారపు రవి, రేణిగుంట్ల సురేశ్, ఆయుధాల సదానందం, పసుపుల విజయ్‌కుమార్, మాతంగి సురేశ్, కనుకుంట్ల రాజేందర్, నారమళ్ల అనిల్, నేతగాని శ్రీనివాస్, అన్నారపు నరేందర్, రాచర్ల రవీందర్ ఉన్నారు.