ముంబై, మార్చి 4 : క్లాసిక్ మోటర్‌సైకిల్ బ్రాండ్ యెజ్డీ..మరో బైకును దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. రోడ్‌స్టార్ రెడ్ వోల్ఫ్ పేరుతో విడుదల చేసిన ఈ ప్రీమియం స్పోర్ట్స్ బైకు ధరను రూ.2.09 లక్షలుగా నిర్ణయించింది. 350 ఆల్ఫా 2 లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో తయారైన ఈ బైకులో డ్యూయల్ చానెల్ ఏబీఎస్, ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఈ బైకుపై నాలుగేండ్లు లేదా 50 వేల కిలోమీటర్ల వరకు వ్యారెంటీని ఇస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యారెంటీని ఆరేండ్ల వరకు పెంచుకునే వీలు కల్పించింది. లీటర్ పెట్రోల్‌కు 30 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.