Salil Arora | ఐదు బంతుల్లో 5 సిక్సర్లు.. వైల్డ్ ఫైర్ ఆటతో అలరించిన కొత్త కుర్రాడు..!
Salil Arora : ఐపీఎల్ మెరుపులతో భారత జట్టు జెర్సీ వేసుకోవాలని కలలు కంటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యువకెరటం సలీల్ అరోరా (Salil Arora) త్వరలోనే ఈ జాబితాలో చేరేలా కనిపిస్తున్నాడు.
Salil Arora : ఐపీఎల్ అంటే చాలు కుర్రాళ్లు రెచ్చిపోతుంటారు. తమదైన దూకుడుతో అలరిస్తూ జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడాలని ఆశ పడుతారు. ఐపీఎల్ మెరుపులతో భారత జట్టు జెర్సీ వేసుకోవాలని కలలు కంటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యువకెరటం సలీల్ అరోరా (Salil Arora) త్వరలోనే ఈ జాబితాలో చేరేలా కనిపిస్తున్నాడు. పంతొమ్మిదో సీజన్ లక్ష్యంగా నెట్స్‌లో చెమటోడ్చుతున్న సలీల్ సిక్సర్ల మోత మోగించాడు. శనివారం ప్రాక్టీస్ మ్యాచ్‌లో శివమెత్తిన ఈ చిచ్చరపిడుగు వరుసగా ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాది నాతో జాగ్రత్త అని ప్రత్యర్ధులకు హెచ్చరికలు పంపాడు.
మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ పంతొమ్మిదో సీజన్‌కు పక్కాగా సిద్ధమవుతోంది. పవర్ హిట్టర్లతో నిండిన ఆరెంజ్ ఆర్మీలో మరో కుర్రాడు సిక్సర్లతో వార్తల్లో నిలిచాడు. శనివారం ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెచ్చిపోయిన సలీల్ అరోరా ఐదు సిక్సర్లతో వారెవా అనిపించాడు.
WILDFIRE has a 🆕 name 🔥😍 pic.twitter.com/IUIKnHNUS5
— SunRisers Hyderabad (@SunRisers) March 21, 2026
ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో సీనియర్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ఓవర్లో చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలిచిన సలీల్.. ఆ తర్వాత ఓంకార్ తరమలేకు చుక్కలు చూపించాడు. అతడు సంధించిన తొలి మూడు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపాడు. మినీ వేలంలో రూ.1.50 కోట్లు పలికిన సలీల్.. తన స్టయిల్ అటాకింగ్ గేమ్‌తో పంతొమ్మిదో సీజన్లో చెలరేగిపోవాలని భావిస్తున్నాడు. వికెట్ కీపరైన ఈ కుర్రాడిని ఆరెంజ్ ఆర్మీ ఎన్ని మ్యాచుల్లో ఆడిస్తుందో చూడాలి.
కమిన్స్ ఆలస్యంగా
ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోర్ కొట్టిన సన్‌రైజర్స్ హైదారబాద్ ఈసారీ తడాఖా చూపించాలనుకుంటోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లకు తోడు తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ శర్మ దంచేసేందుకు సిద్ధమవుతున్నారు. రెగ్యులర్ సారథి ప్యాట్ కమిన్స్ ఆలస్యంగా జట్టుతో కలువనున్నాడు. సో.. ఆలోపు ఇషాన్ సారథ్యంలోనే ఆరెంజ్ ఆర్మీ ఆడనుంది. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఆరంభ పోరులో ఢిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో హైదరాబాద్ తలపడనుంది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

