Rajivgandhi Civils Abhayahastham | గోదావరిఖని, జూన్ 21 : దేశంలోనే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమవుతున్న తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు ఆర్థిక ప్రతిబంధకాలను తొలగించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచనతో సింగరేణి కాలరీస్ రూపొందించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ పేర్కొన్నారు.
ఇటీవల విడుదలై సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందించేందుకు ఈ నెల 23వ తేదీ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సీఎండీ ఎన్ బలరామ్ వెల్లడించారు. సివిల్స్ ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన సింగరేణి కార్మికుల పిల్లలకు కూడా రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించనున్నట్లు వెల్లడించారు.
సింగరేణి సామాజిక బాధ్యత నిధులతో గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం మంచి ఫలితాన్ని ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో ఈ ఏడాది కూడా మరింత మందికి ప్రోత్సాహం అందించేందుకు దీన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. గత ఏడాది 140 మంది ప్రిలిమ్స్ పాసైన వారికి సాయం అందించగా.. 20 మంది మెయిన్స్‌లోనూ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని, ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి మరో లక్ష రూపాయల సాయం కూడా అందించామని, వారిలో ఏడుగురు సివిల్స్ లో సత్తా చాటారని వివరించారు.
Sarangapur | కాలువల్లో పేరుకుపోయిన మురుగు.. వర్షం పడితే రోడ్డుపై నడువాలంటే చెప్పులు చేతపట్టాల్సిందే
Pension | పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్