Annadanam | పెద్దపల్లి, జూన్ 10 : అన్నదానం గొప్పదానమని పెద్దపల్లి లయన్స్క్లబ్ కార్యదర్శి బొడకుంట రాంకిషన్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఉప్పు స్నితిక్ పుట్టిన రోజు సందర్బంగా మంగళవారం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన ఆవరణలో అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లయన్స్క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా అన్నదానం చేస్తున్నామని చెప్పారు. బర్త్ డే, పెళ్లి రోజు, ఇతర శుభసందర్భాల్లో అన్నదానం చేయాలనుకునే దాతలు రూ. 2500తో 150 మందికి అల్పాహార వితరణ, రూ. 5000తో150 మందికి మీల్స్ ఆన్ వీల్స్ద్వారా అన్నదానం చేయవచ్చని తెలిపారు.
పేద వారి కడుపు నింపేందుకు చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమానికి దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నదాత ఉప్పు తిరుపతి కుటుంబసభ్యులు, సాదుల వెంకటేశ్వర్లు, కావేటి రాజగోపాల్, దుబాసి కుమార్ తదితరులు పాల్గొన్నారు.