సుల్తానాబాద్ రూరల్ సెప్టెంబర్ 16 : పోషణ మాసంలో భాగంగా మండలంలోని గర్రెపల్లి గ్రామంలో బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ వీరగోని రమేష్ అధ్యక్షతన, ఐసీడీఎస్ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో శ్రీమంతం, అన్నప్రాసన, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గర్భిణులకు శ్రీమంతం, ఆరు నెలలు నిండిన శిశువులకు అన్నప్రాసన, మూడు సంవత్సరాలు నిండిన పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా జరిపించారు.
అనంతరం గర్భిణిలు, బాలింతలు, తల్లులకు పౌష్టికాహారం, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం గురించి వారు అవగాహన కల్పించారు.
గర్భధారణ సమయంలో పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లి ఆరోగ్యంతో పాటు శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు దోహదపడుతుందని వారు వివరించారు.
ఆరు నెలల తర్వాత శిశువులకు తల్లిపాలతో పాటు వయస్సుకు తగిన అదనపు ఆహారం అందించడం, పిల్లలకు వైవిధ్యమైన పోషకాహారం అందించడం, పరిశుభ్రత పాటించడం వంటి అంశాలపై తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు స్వర్ణలత, రమాదేవి, మాధవి, ఆశ, ఏఎన్ఎంలు, తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా