Salt Production | దేశంలో తరిగిపోతున్న ఉప్పు ఉత్పత్తి.. కారణాలివే అంటున్న నిపుణులు..!
Salt Production | వాతావరణ మార్పుల (Climate Change) ప్రభావం దేశంలోని కీలక రంగాలపై తీవ్రంగా పడుతోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఉప్పు ఉత్పత్తిదారు (Salt Producer) గా ఉన్న భారత్‌లో ఇప్పుడు ఉప్పు సంక్షోభం (Salt Crisis) స్పష్టంగా కనిపిస్తోంది. అకాల వర్షాలు, తరచూ సంభవిస్తున్న తుపానులు, రుతుపవనాల తీరులో మార్పులు వంటి కారణాలతో ఉప్పు ఉత్పత్తి తీవ్రంగా తగ్గిపోతున్నది.
Salt Production : వాతావరణ మార్పుల (Climate Change) ప్రభావం దేశంలోని కీలక రంగాలపై తీవ్రంగా పడుతోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఉప్పు ఉత్పత్తిదారు (Salt Producer) గా ఉన్న భారత్‌లో ఇప్పుడు ఉప్పు సంక్షోభం (Salt Crisis) స్పష్టంగా కనిపిస్తోంది. అకాల వర్షాలు, తరచూ సంభవిస్తున్న తుపానులు, రుతుపవనాల తీరులో మార్పులు వంటి కారణాలతో ఉప్పు ఉత్పత్తి తీవ్రంగా తగ్గిపోతున్నది.
ముఖ్యంగా దేశంలోనే అత్యధికంగా ఉప్పును ఉత్పత్తిచేసే గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లోని ఉప్పు రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. భారత్‌లో ఏటా సగటున 30.7 మిలియన్ టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతుంది. ఇందులో సింహభాగం, అంటే దాదాపు 85 నుంచి 87 శాతం గుజరాత్ నుంచే వస్తుంది. సంప్రదాయబద్ధంగా సముద్రపు నీటిని గానీ, భూగర్భంలోని ఉప్పునీటిని గానీ విశాలమైన మడుల్లోకి (ప్యాన్లు) పంపి, సూర్యరశ్మికి ఆవిరయ్యేలా చేయడం ద్వారా ఉప్పును తయారు చేస్తారు.
ఈ ప్రక్రియకు సుదీర్ఘమైన పొడి వాతావరణం, తగినంత సూర్యరశ్మి అవసరం. వర్షపాతం వీలైనంత తక్కువగా ఉండాలి. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులవల్ల ఈ ప్రక్రియకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. గుజరాత్‌లోని కచ్ ఎడారి ప్రాంతం, తమిళనాడులోని తూత్తుకుడి, మరక్కాణం వంటి తీరప్రాంతాల్లోని ఉప్పు క్షేత్రాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. అకాల వర్షాలు కురవడంవల్ల మడుల్లోని ఉప్పునీటి గాఢత తగ్గిపోతున్నది.
దాంతో నీరు ఆవిరయ్యే ప్రక్రియ నెమ్మదిస్తున్నది. కొన్నిసార్లు తయారైన ఉప్పు స్ఫటికాలు వర్షపు నీటిలో కొట్టుకుపోతున్నాయి. దీనివల్ల ఉత్పత్తికాలం తగ్గిపోవడమే కాకుండా, దిగుబడి కూడా గణనీయంగా పడిపోతున్నది. గుజరాత్లో రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభం కావడం లేదా ఎక్కువకాలం కురవడంవల్ల ఉప్పు తయారీ సీజన్ ఆలస్యమవుతోంది. తమిళనాడులోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో, కొన్నిసార్లు అక్కడి వ్యాపారులు గుజరాత్ నుంచి ఉప్పును దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది.
లిటిల్ రాణ్ ఆఫ్ కచ్‌లోని ఉప్పు రైతులపై 2026 లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. మారుతున్న వర్షపాత సరళి, విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉత్పత్తిని దెబ్బతీస్తున్నాయని తేలింది. ఉష్ణోగ్రతలలో మార్పులు కూడా నీరు ఆవిరయ్యే వేగాన్ని, స్ఫటికాల ఏర్పాటును ప్రభావితం చేస్తున్నాయని ఆ అధ్యయనం పేర్కొన్నది. తీర ప్రాంతాల్లో తుపానులు, బలమైన గాలులు మరో పెను సవాలుగా మారాయి. రైతులు తమ మడుల చుట్టూ గట్లు నిర్మించుకుని రక్షణ చర్యలు తీసుకుంటున్నా, అవి పెద్ద వర్షాలు, వరదల ముందు నిలవలేకపోతున్నాయి.
ఈ సమస్యను అధిగమించేందుకు పరిశోధనా సంస్థలు ప్రత్యామ్నాయ టెక్నాలజీలపై దృష్టి సారించాయి. ప్రతికూల వాతావరణంలోనూ నీటిని వేగంగా ఆవిరిచేసే పద్ధతులపై ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ఈ టెక్నాలజీలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో దేశీయ ఉప్పు ఉత్పత్తిపై మరింత ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

