కరీంనగర్ : జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంగళవారం ఉదయం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన పేదలందరికి ప్రతినెల ఒక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామన్నారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యంలో అక్రమాలు చోటు చేసుకుంటున్న విషయాన్ని గుర్తించి అరికట్టామన్నారు. అలాగే పేదలందరికీ సంపూర్ణంగా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | నగరంలో దారుణం.. జర్మనీ యువతిపై క్యాబ్ డ్రైవర్ల లైంగిక దాడి..
Stock Market | కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు.. 1300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..