Infinix Note 50x 5G+ | ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తోంది. అందులో భాగంగానే స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఏఐ ఫీచర్లు కలిగిన ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. వినియోగదారులు కూడా ఈ తరహా ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్ఫినిక్స్ కంపెనీ లేటెస్ట్గా నోట్50ఎక్స్ 5జి ప్లస్ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.67 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లేపై నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు.
ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంది. 90ఎఫ్‌పీఎస్‌తో గేమ్స్ ఆడుకోవచ్చు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. మరో 8 జీబీ వరకు వర్చువల్‌గా ర్యామ్‌ను పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఫ్లోటింగ విండో, డైనమిక్ బార్, గేమ్ మోడ్, కిడ్స్ మోడ్, పీక్ ప్రూఫ్ వంటి ఫీచర్లను ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఫోలాక్స్ స్మార్ట్ అసిస్టెంట్ దీంట్లో ఉంది. ఇది వాతావరణ అప్డేట్స్ను అందిస్తుంది. దీంతోపాటు కెమెరాను కంట్రోల్ చేయవచ్చు. చాటింగ్ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఫోన్‌కు 2 ఏళ్ల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ను, 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందించనున్నారు.
ఇక ఈ ఫోన్లో ఉన్న ఏఐ ఫీచర్ల విషయానికి వస్తే ఏఐజీసీ పోర్ట్రెయిట్ మోడ్, ఏఐ వాల్ పేపర్ జనరేటర్, ఏఐ నోట్, ఫోలాక్స్ ఏఐ వాయిస్ అసిస్టెంట్, ఏఐ గ్యాలరీ, ఏఐ ఎరేజర్, ఏఐ కట్ అవుట్, సెర్చ్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. రైటింగ్ అసిస్టెంట్ కూడా ఉంది. దీని సహాయంతో డాక్యుమెంట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ అసిస్టెంట్, కాల్ అసిస్టెంట్, సోషల్ అసిస్టెంట్, సర్కిల్ టు సెర్చ్ వంటి అదనపు ఏఐ ఫీచర్లను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఇందులో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. మరో సెకండరీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. వీటి సహాయంతో 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ఈ ఫోన్‌కు ఎంఐఎల్-ఎస్టీడీ-810హెచ్ సర్టిఫికేషన్ ఉంది. అందువల్ల ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ నాణ్యతను కలిగి ఉంటుంది. అంత సులభంగా పగలదు. దీనికి ఐపీ 64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు.
ఇన్ఫినిక్స్ నోట్ 50ఎక్స్ 5జి ప్లస్ స్మార్ట్ ఫోన్లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సదుపాయాన్ని అందిస్తున్నారు. చార్జర్ కూడా బాక్స్‌తోపాటు వస్తుంది. బ్యాటరీ లైఫ్ 6 ఏళ్ల వరకు ఉంటుందని తెలిపారు. 6జీబీ ర్యామ్, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మెమొరీని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, యూఎస్బీ టైప్ సి, 5జి, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.4 వంటి అదనపు ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.11,499 ఉండగా, 8జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.12,999గా ఉంది. ఫ్లిప్ కార్ట్ సైట్లో ఈ ఫోన్లను ఏప్రిల్ 3వ తేదీ నుంచి విక్రయిస్తారు. ఐసీఐసీఐ కార్డుల ద్వారా ఈ ఫోన్‌పై రూ.1000 ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు.