Hyderabad | నగరంలో దారుణం.. జర్మనీ యువతిపై క్యాబ్ డ్రైవర్ల లైంగిక దాడి..
Hyderabad | హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. స్వదేశానికి వెళ్లేందుకు బయలుదేరిన జర్మనీ యువతికి లిఫ్ట్ ఇస్తామంటూ క్యాబ్ డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
Hyderabad | పహాడి షరీఫ్, ఏప్రిల్ 1: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. స్వదేశానికి వెళ్లేందుకు బయలుదేరిన జర్మనీ యువతికి లిఫ్ట్ ఇస్తామంటూ క్యాబ్ డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జర్మనీకి చెందిన ఓ యువతి శుభ కార్యానికి హాజరయ్యేందుకు మార్చి 4న నగరానికి వచ్చింది. అప్పటి నుంచి నగరంలోనే ఉన్న యువతి.. మార్చి 31న జర్మనీ వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అదే రోజు రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లేందుకు మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని మండమల్లమ్మ క్రాస్ రోడ్లో క్యాబ్ కోసం ఎదురు చూస్తుంది.
అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఓ క్యాబ్ డ్రైవర్ ఎయిర్ పోర్ట్ వరకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో యువతిని ఎక్కించుకున్నాడు. అప్పటికే కారులో మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎయిర్ పోర్ట్‌కి వెళ్లేదారిలో మధ్యలో కారు నిలిపి వేసి యువతిపై ముగ్గురు లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం యువతికి అక్కడే వదిలేసి దుండగులు పారిపోయారు. బాధితురాలు స్థానికుల సహాయంతో పహాడిషరీఫ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన విజువల్స్ ద్వారా క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

