Sand Reaches | మానకొండూరు రూరల్, ఫిబ్రవరి 15 : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరులోని ఇసుక రీచ్‌లను ఇవాళ మైనింగ్ అధికారులు తనిఖీలు చేశారు. ఇసుక రీచ్ (Sand Reaches) రికార్డులను, ఇసుక యార్డుకు వాహనాలు వెళ్లే దారిని పరిశీలించారు. అనంతరం అధికారులు సీసీ కెమెరాల పనితీరును సైతం పర్యవేక్షించారు.
అనుమతి కంటే ఎక్కువ లోడును తరలిస్తే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. వాహనాలను నిరంతరం తనిఖీ చేయాలని ఆర్ఐ ఆంజనేయులు సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీల్లో ఎస్ఆర్ఏలు, సిబ్బంది పాల్గొన్నారు.
Government Hospital | రికార్డ్ బ్రేక్.. 5 రోజుల్లో 200 సర్జరీలు