lathi charge | కరీంనగర్ 58వ డివిజన్లోని జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ఒక మహిళకు తాను ఇది వరకే ఓటు వేసినట్లు ఉందని పోలింగ్ సిబ్బంది చెప్పారు. దీంతో దొంగ ఓట్లు పడుతున్నాయని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ అభ్యర్థి రవిందర్ సింగ్తో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో పరస్పరం నినాదాలు చేసుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్థ పరిస్థితులు నెలకొన్నాయి. గొడవ కాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీయడంతో సీపీ గౌష్ ఆలం నేతృత్వంలో ఆర్మీ, పోలీసుల బృందం రంగంలోకి దిగింది. లాఠీ చార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టగా..
పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.
బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీఛార్జ్ వీడియో..
కొత్తగూడెంలో ప్రశాంతంగా పోలింగ్.. ఓటు వేసిన కలెక్టర్
నల్లగొండలో ఓటేసిన ట్రాన్స్జెండర్లు
Chennuru | పోలింగ్ రోజూ మంత్రి వివేక్ ప్రచారం..! ఎన్నికల సంఘం తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు