జగిత్యాల : తెలంగాణలో రైతుల జీవన విధానం మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం హుస్నాబాద్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. రైతుబంధు, సరిపడా నీళ్లు, ఉచిత కరెంట్, ధాన్యం కొనుగోళ్లు ఇలా రైతుల కోసం అనేక పథకాలు చేపడుతుండటంతో రైతుల దశ మారిపోయిందన్నారు. సీఎం కేసీఆర్కు మనమంతా అండగా ఉండాలన్నారు.
కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్ ,మండల పార్టీ అధ్యక్షుడు సురేందర్ రావు, సర్పంచ్ లక్ష్మణ్ రావు, ఎంపీటీసీ మల్లా రెడ్డి, రైతు బందు మండల కన్వీనర్ శంకర్,ఎస్టీ విభాగం అధ్యక్షుడు శ్రీరామ్ భిక్ష పతి, తదితరులు పాల్గొన్నారు.