హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారంటూ నమోదైన కేసులో ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరాలు సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. సీఎం ఫొటోను మార్ఫింగ్ చేయడంపై నమోదుచేసిన కేసును కొట్టివేయాలంటూ కావలి వెంకటేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జే శ్రీనివాసరావు సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తప్పుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.