T Jeevan Reddy | జగిత్యాల, మే 21 : ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని బీఆర్ఎస్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు రెడ్డెక్కి ఆందోళన చేస్తే రాజకీయం చేస్తున్నరంటున్నారని, కల్లాలల్లో ధాన్యం నిల్వలు ఎందుకు పేరుకుపోయాయని ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాయికల్ వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న ధాన్యం సెంటర్ను గురువారం పరిశీలించారు. మార్కెట్ లో ధాన్యం 40వేల క్వింటాళ్లు ఉందని, తూకం వేసినవి 20 వేల సంచులు ఉన్నాయని తెలుసుకున్న ఆయన మార్కెట్ లో ధాన్యం పరిశీలించారు.
సంబంధిత జిల్లా అధికారి రెవెన్యూ కలెక్టర్, మార్క్ ఫెడ్ డీఎంతో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ మార్కెట్లో 20 వేల సంచులు తూకం వేసినవి సంచులు ఉన్నాయని, లారీలు రావడం లేదని రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. తాము రైతులతో కలసి రోడ్డు ఎక్కితే రాజకీయం అంటున్నారని, కల్లాలలో ధాన్యం అలాగే ఉందనీ, సమస్య పరిష్కారం కావాలని, లారీలు రోజుకు 4 వస్తేనే కానీ ధాన్యం తూకం కాదని పేర్కొన్నారు. జిల్లా మార్కుఫెడ్ అధికారులు కనీసం ఫోన్ కూడా లేపడం లేదని రైతులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. లారీలు వచ్చేలా చూడాలని, మేజ్ పరిమితి కూడా పెంచుతామని ఎండీ తెలిపారన్నారు.
గోదాముల కేటాయింపు, లారీల సమస్య తీవ్రంగా ఉందని అధికారులకు తెలిపారు. జగిత్యాలలో మార్కెట్ లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ గోదాములు అందుబాటులో ఉన్నాయి, కానీ వాటిని వాడడం లేదని, మార్కెట్ గోదాములు కాంట్రాక్టరు తన అవసరాలకు వాడుతున్నారనీ విమర్శించారు. గోదాములు ఎక్కడ ఇచ్చిన ధాన్యం రవాణా చేయాలని జీవన్ రెడ్డి సూచించారు. అధికారులు తూకం చేస్తాం, లారీలు వచ్చి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని జీవన్ రెడ్డితో తెలిపారన్నారు. ఆయన వెంట మాజీ జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, రాయికల్ మున్సిపల్ చైర్మన్ రవి, యువజన నాయకుడు తాటిపర్తి సీకే రెడ్డి, పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.