Mother | జగిత్యాల, జులై 15 : కన్నతల్లిని కొడుకులు ఇంట్లో నుంచి గెంటేసిన అమానవీయ ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది. కొడుకులు, కోడళ్లు తనను పోషించక పోగా ఇంట్లోంచి కొట్టి గెంటి వేశారని సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన తులసి వెంకటవ్వ, సీనియర్ సిటిజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్‌ను ఆశ్రయించింది. ఆయన సాయంతో ఆర్డీవో మధుసూదన్‌కు మంగళవారం ఫిర్యాదు చేసింది.
కొడుకులు విదేశాలకు వెళ్లి బాగా సంపాదిస్తున్నా తనకు తిండి పెట్టక కొట్టి ఇంట్లోంచి వెళ్లగొట్టారని కొడుకులు జగన్, మహేష్, కోడళ్లు గంగ, గౌతమిలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్డీవో మధుసూదన్ మాట్లాడుతూ.. వయో వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి పిల్లలదేనని, లేనిచో జైలు శిక్ష, జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరు కొడుకులు, కోడళ్లపై వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం సెక్షన్ 2(బి),సెక్షన్ 4(1), సెక్షన్ 24 ప్రకారం కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని వృద్ధుల చట్టం అసిస్టెంట్ పద్మజను ఆదేశించారు.
ఆ వృద్ద్దురాలి వెంట సీనియర్ సిటిజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కౌన్సెలింగ్ అధికారి పీసీ హన్మంత రెడ్డి, ప్రతినిధులు వెల్ముల ప్రకాష్ రావు, దిండిగాల విఠల్, సత్యనారాయణ తదితరులున్నారు.
Maddur | వర్షాల కోసం బతుకమ్మ ఆడిన మహిళలు
Bonalu | గుమ్మడిదలలో ఘనంగా ఎల్లమ్మతల్లి బోనాలు
Congress leader | మెదక్ జిల్లాలో కాంగ్రెస్ యువ నాయకుడు అనుమానాస్పద మృతి