Private Bus Owners | కోరుట్ల, మే 19 : ప్రైవేట్ స్కూల్ బస్సుల యజమానులు అన్ని రకాల వాహన సంబంధిత ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని జిల్లా రవాణాశాఖాధికారి భద్రు నాయక్ ఆన్నారు. పట్టణంలోని ఆర్టీవో యూనిట్ కార్యాలయంలో సోమవారం కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల ప్రైవేట్ స్కూల్ యాజమానులతో డీటీవో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీటీవో మాట్లాడుతూ.. ప్రైవేట్ స్కూల్ బస్సులకు సంబంధించి ఫిట్నెస్, పర్మిట్, రిజిస్ట్రేషన్, పొల్యూషన్, టాక్స్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ప్రైవేట్ స్కూల్ బస్సులో హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ పొంది కనీసం ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలన్నారు.
60 ఏళ్లు పైబడిన డ్రైవర్లను నియమించరాదన్నారు. బస్సుల్లో మెడికల్ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఫైర్ ఎగ్జిట్స్ తప్పక కలిగి ఉండాలన్నారు. స్కూల్ బస్సులపై యాజమాన్యాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నిబందనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీటీవో హెచ్చరించారు. ఈ సమావేశంలో కోరుట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు గిరీష్, వజ్ర, రవాణా శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.