జగిత్యాల రూరల్ మే 28 : జగిత్యాల రూరల్ మండలంలోని గుల్లపేట గ్రామంలో రోడ్డు పక్కన గల విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. ట్రాన్స్ ఫార్మర్ అక్కడి నుండి వేరే చోటకు మార్చాలని విద్యుత్ అధికారులకు సంవత్సర కాలం నుండి చెబుతున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో బోనాల పండుగ ఉండంటతో గుడికి వెళ్లే దారిని ఆనుకోని ఉన్న ట్రాన్స్ ఫార్మర్తో ఏమైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. వెంటనే విద్యుత్ అధికార్లు స్పందించి ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ ఫార్మర్ను అక్కడి నుండి మరో చోటుకు మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Indore couple | హనీమూన్ కోసం వెళ్లి.. దట్టమైన అడవుల్లో అదృశ్యమయ్యారు..
Helicopter FAL | దేశంలోనే తొలి హెలికాప్టర్ తయారీ కేంద్రం.. ఎక్కడంటే..!
Junior Colleges | 183 జూనియర్ కాలేజీలు క్లోజ్.. అంపశయ్యపై 101 ప్రభుత్వ, 77 ప్రైవేట్ కాలేజీలు