Sai Pallavi | తమిళం, తెలుగుతోపాటు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న నటీమణుల్లో టాప్‌లో ఉంటుంది సాయిపల్లవి (Sai Pallavi). ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్‌కు సంబంధించి ఏ వార్త వచ్చినా అది అభిమానులకు ట్రీట్ అనే చెప్పాలి. అందం, అభినయంతోపాటు డ్యాన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసే ఈ భామ ఇప్పటికే బాలీవుడ్ నుంచి రాబోతున్న ఎపిక్ ప్రాజెక్ట్ రామాయణలో నటిస్తుందని తెలిసిందే. తాజాగా సాయిపల్లవికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ నెట్టింట రౌండప్ చేస్తోంది. ఈ భామ భారీ బయోపిక్‌లో నటించబోతుందట.
పాపులర్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ ఐకానిక్ సెలబ్రిటీ మధుబాల జీవితం ఆధారంగా తెరకెక్కించనున్న సినిమాలో లీడ్ రోల్ కోసం సాయిపల్లవిని సంప్రదించాడట. ఈ బయోపిక్ కోసం ముందుగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ, అనీత్ పడ్డాను సంప్రదించాలని వార్తలు రాగా.. తాజాగా సాయిపల్లవి పేరు తెరపైకి వచ్చింది. సాయిపల్లవి హిందీ డెబ్యూ సినిమా ఏక్ దిన్ 2026 మేలో విడుదల కానుంది. ఈ మూవీ విడుదల కాకముందే భన్సాలీ సినిమాకు సంబంధించిన వార్త బయటకువ రావడం అభిమానులు ఖుషీ అవుతున్నారు.
సంజయ్ లీలా భన్సాలీ సినిమాలంటే హీరోయిన్ పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి ఇప్పటికే తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న సాయిపల్లవితో సినిమా చేస్తున్నాడంటే అంచనాలు పెరిగిపోవడం పక్కా అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి రానున్న రోజుల్లో ఈ క్రేజీ బయోపిక్‌పై ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. ఇదే నిజమైతే సాయిపల్లవి కెరీర్‌కు ఈ మూవీ మైల్‌స్టోన్‌గా మారిపోవడం ఖాయమైనట్టేనని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.