SP Ashok kumar | కోరుట్ల, మార్చి 8: ప్రయాణికుల భద్రతే పోలీస్ శాఖ లక్ష్యమని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఇవాళ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ అశోక్ కుమార్ ఆటో డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలు, చిన్నారులు, వృద్ధుల రక్షణ బాధ్యత ఆటో డ్రైవర్లదని పేర్కొన్నారు.
సమాజంలో జరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు ప్రభుత్వం విధి, విధానాలను నిర్దేశించి అమలు చేసేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తుందని చెప్పారు. పోలీసు వారి సూచనలను పాటిస్తూ ఆటో డ్రైవర్లు తమ వాహనానికి స్టిక్కర్లను అంటించాలని పోలీసువారు ప్రవేశపెట్టిన యాప్ను డౌన్లోడ్చేసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజల భద్రత, ఆటో డ్రైవర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పి తెలిపారు.
జిల్లాలో మొత్తం 4000 ఆటోలు తిరుగుతున్నాయని, 2093 ఆటోలకు పోలీస్ స్టేషన్లో క్యూ ఆర్ కోడ్, రిజిస్ట్రేషన్ నెంబర్లు కేటాయించడం జరిగిందని చెప్పారు. ప్రతీ ఆటోడ్రైవర్ తమ తమ వాహనాన్ని పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ఆటోలపై పోలీసులు సూచించిన భద్రతాపరమైన స్టిక్కర్లను అతికించుకోవాలని సూచించారు.
అనంతరం పలు ఆటోలకు పోలీసు శాఖ క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లను ఎస్పీ అతికించారు. ఈ సమావేశంలో మెట్పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ సురేష్ బాబు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐలు శ్రీకాంత్, రామచంద్రం ఉన్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్