జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం(Pegadapalli) బతికపల్లి గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ(SRSP canal) నీళ్లు ఎస్సీ కాలనీలోకి రాకుండా శుక్రవారం అధికారులు చర్యలు చేపట్టారు. కాలువలో నీళ్లు అధికంగా వచ్చి కాల్వ గట్టుపై నుంచి సమీపంలోని ఎస్సీ కాలనీలో గల నివాస గృహాల్లోకి చేరడంతో ఇళ్లల్లోని నిత్యావసర వస్తువులు తడిచిపోయాయి. దీంతో తమకు నష్టం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. వెంటనే స్పందించిన అధికారులు శుక్రవారం కాలువలోని చెత్త, బండలను తొలగించి నీళ్లు కిందికి పోయేలా చర్యలు తీసుకున్నారు.
కాలువ నీళ్లు తమ ఇళ్లల్లోకి రాకుండా శాశ్వతంగా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, ఎస్సారెస్పీ, వర్క్ ఇన్స్పెక్టర్ హేష్, పంచాయతీ కార్యదర్శి నిఖిల్ రెడ్డి, మాజీ సర్పంచ్ శోభారాణి తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..