జగిత్యాల : జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణిని పూర్వ విద్యార్థుల ఘనంగా సన్మానించారు. జగిత్యాల పట్టణంలోని పురాణిపేట ప్రభుత్వ పాఠశాల 1988–89 పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మున్సిపల్ చైర్ పర్సన్‌ను మర్యాదపూర్వకంగా కలసి సన్మానించారు. ఈ సందర్భంగా అదే బ్యాచ్‌కు చెందిన వాణి నేడు జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్‌గా సేవలందిస్తూ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు పూర్వ విద్యార్థులు సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. వాణి భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 1988–89 బ్యాచ్ సభ్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Yadagirigutta | యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 3 గంటలు సమయం