Prabhas Spirit | సందీప్ వంగా మాస్టర్ ప్లాన్.. ప్రభాస్ కెరీర్లోనే తక్కువ బడ్జెట్‌తో ‘స్పిరిట్’!
Sandeep Reddy Vanga | టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రం 'స్పిరిట్' (Spirit) గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్యాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
Spirit | టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రం ‘స్పిరిట్’ (Spirit) గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్యాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్‌ను కేవలం 100 రోజుల్లోనే పూర్తి చేయాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్‌ల షూటింగ్స్‌లో సమాంతరంగా పాల్గొంటున్నప్పటికీ, ‘స్పిరిట్’ టీమ్ మాత్రం తమ ప్లానింగ్ పక్కాగా ఉండటంతో సినిమా అనుకున్న సమయానికే పూర్తవుతుందని పూర్తి విశ్వాసంతో ఉంది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సుమారు 40 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. మిగిలిన మేజర్ షెడ్యూల్స్ ఎక్కువగా హైదరాబాద్‌లోనే జరగనున్నాయి.
ఇదిలావుంటే సందీప్ టీమ్ ప్లానింగ్ వలన ప్రభాస్ చేస్తున్న అత్యంత తక్కువ బడ్జెట్ సినిమా ఇదేనని తెలుస్తుంది. గత దశాబ్ద కాలంలో ప్రభాస్ చేసిన భారీ బడ్జెట్ సినిమాలతో పోలిస్తే ‘స్పిరిట్’ అత్యంత తక్కువ బడ్జెట్‌తో రాబోతుందని ఇప్పటికే టాక్ కూడా బయటకు పాకింది. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తనదైన మేకింగ్ స్టైల్‌తో ఈ చిత్రాన్ని మరింత పవర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

