జగిత్యాల, మే 23 : అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశించారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్ వ్యవసాయ మార్కెట్లో కోనాపూర్, తిప్పన్నపేట గ్రామంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు అధైర్య పడవద్దు అని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడిసిన ధాన్యం కొనుగోలు విషయంపై కలెక్టర్, అదనపు కలెక్టర్ తో మాట్లాడానని పేర్కొన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేశామన్నారు. అకాల వర్షాలు ఉన్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మల్లారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, నక్కల రవీందర్ రెడ్డి, పెండెం రాములు, బాల ముకుందం, కోల శ్రీనివాస్, శేఖర్ గౌడ్, గంగారెడ్డి, పురిపాటి రాజిరెడ్డి, బోనగిరి నారాయణ, సీఈవో వేణు, మల్లేష్, కొప్పు మహేష్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.