RTC Bus | బస్టాండ్‌లోకి వెళ్లి ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. వీడియో
RTC Bus | ఓ వ్యక్తికి ఏకంగా బస్సుపై కన్ను పడ్డది. అది కూడా నిత్యం ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సుపైనే పడటం గమనార్హం. ఈ దొంగ ఏకంగా దర్జాగా ఆర్టీసీ బస్టాండ్‌లోకి వెళ్లి ఆర్టీసీ బస్సును తీసుకెళ్లడం కలకలం రేపుతోంది. ఈ ఘటన కోరుట్ల బస్టాండ్‌లో చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి కోరుట్ల బస్టాండ్‌లోకి ప్రవేశించి బస్సును తీసు
RTC Bus | ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట దొంగతనం జరుగడం కొత్తేమి కాదు.. బంగారం, డబ్బు, బైకులు చోరీ అవుతున్న ఘటనలు చూస్తూనే ఉంటాం. కోరుట్లలో కూడా ఓ దొంగతనం జరిగింది. ఇంతకీ ఏం చోరీ జరిగిందనే కదా మీ డౌటు. ఓ వ్యక్తికి ఏకంగా బస్సుపై కన్ను పడ్డది. అది కూడా నిత్యం ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సుపైనే పడటం గమనార్హం. ఈ దొంగ ఏకంగా దర్జాగా ఆర్టీసీ బస్టాండ్‌లోకి వెళ్లి ఆర్టీసీ బస్సును తీసుకెళ్లడం కలకలం రేపుతోంది.
ఈ ఘటన కోరుట్ల బస్టాండ్‌లో చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి కోరుట్ల బస్టాండ్‌లోకి ప్రవేశించి బస్సును తీసుకెళ్లాడు. సమాచారమందుకున్న పోలీసులు ఆర్టీసీ బస్సును వెంబడించారు. ఈ క్రమంలో సదరు దొంగ వేగంగా బస్సును తీసుకెళ్తూ పోలీస్ వాహనాన్ని, పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ పోయాడు.
ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. బస్సు నిజామాబాద్ వైపు వెళ్తుండగా హనుమాన్ దేవాలయం వద్ద గుంతలో దిగి ఆగిపోయింది. దీంతో వెనుకాలే ఫాలో అవుతున్న పోలీసులు బస్సు దిగి పారిపోతున్న దుండగుడిని పట్టుకున్నారు. దుండగుడిని అరెస్ట్ చేసి మెట్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కోరుట్ల బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సును దొంగిలించిన దుండగుడు
వేగంగా వెళ్తూ పోలీస్ వాహనాన్ని, పలు వాహనాలను ఢీకొట్టి.. పలువురికి గాయాలు
నిజామాబాద్ వైపు వెళ్తుండగా హనుమాన్ దేవాలయం వద్ద గుంతలో దిగి ఆగిపోయిన బస్సు
బస్సు దిగి పారిపోతున్న దుండగుడిని పట్టుకున్న పోలీసులు.. మెట్పల్లి… pic.twitter.com/eNzDx0aSKh
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2026
Read Also :
Watch: జిప్‌లైన్ సేఫ్టీ లాక్ ఫెయిల్.. 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన టూరిస్ట్
Health News | రోజుకు 5 కప్పుల వరకు కాఫీ తాగడం సురక్షితమే.. తాజా అధ్యయనంలో వెల్లడి..!
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

