కథలాపూర్, మార్చి 14 : కథలాపూర్ మండలం ఇప్పపల్లి, గంభీర్పూర్ గ్రామాల్లో శుక్రవారం శ్రీలక్ష్మీనరసింహస్వామి (Lakshmi Narasimha Swamy) జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామి వారి కల్యాణం నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. జాతర ఉత్సవాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.
వేంకటేశ్వర స్వామి వారి రథోత్సవం
తక్కల్లపల్లి గ్రామంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి రథోత్సవం శుక్రవారం వేకువ జామున కన్నుల పండుగగా జరిగింది. భక్తులు మహిళలు మంగళహారతులతో రథోత్సవంలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో వేంకటేశ్వర స్వామి రథోత్సవం ఊరేగింపు చేసి అనంతరం ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల పెద్దలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.