Fertilizers godown | కొడిమ్యాల, మే 27 : కొడిమ్యాల మండలంలోని పూడూర్ గ్రామంలో ఇండియన్ బ్యాంక్ వెనకాల పూడూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల క్రితం 500 మెట్రిక్ టన్నుల గోదాంను నిర్మించారు. నాబార్డ్ నిధులు రూ.38 లక్షలు, సహకార సంఘం నిధులు రూ.3 లక్షలతో గోదాంను నిర్మించారు.
అయితే రైతుల కోసం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన గోదాం నిరుపయోగంగా మారింది. ఈ నేపథ్యంలో భారీ వ్యయంతో నిర్మించి వృధాగా మారిపోయిన గోదాంను వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై సహకార సంఘం సీఈఓ రాజేందర్‌ను వివరణ కోరగా.. గోదాం ముందు ట్రాన్స్ఫార్మర్ ఉందని దానిని తొలగించిన తర్వాత వినియోగించనున్నట్టు తెలిపారు.
Rains | హైదరాబాద్‌కు నేడు నైరుతి.. ఎప్పుడైనా భారీ వర్షం కురిసే అవకాశం..!
Metuku Anand | కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం : మెతుకు ఆనంద్
US Visa | క్లాస్‌లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ కీలక హెచ్చరికలు