పెగడపల్లి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘానికి మంగళవారం సాయంత్రం 300 బస్తాలు వచ్చాయి. వాటి కోసం రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఒక్కో రైతుకు ఎకరాకు ఒక యూరియా బస్తా చొప్పున పంపిణీ చేశారు. 8 గ్రామాలకు సంబంధించిన పెగడపల్లి సహకార సంఘానికి కేవలం 300 బస్తాలు రావడం వల్ల యూరియా బస్తాలు సరిపోవడం లేదని రైతుల ఆరోపించారు.
రాత్రి 9 గంటల వరకు వ్యవసాయ అధికారి శ్రీకాంత్ అక్కడే ఉండి రైతులకు బస్తాలను పంపిణీ చేశారు. రైతులందరికి పూర్తి బస్తాలుస్థాయిలో సరిపోక పోవడంతో, మళ్లీ రాగానే అందిస్తామని అధికారులు తెలుపడంతో వారు నిరాశతో వెళ్లిపోయారు. ప్రభుత్వం స్పందించి పంటలకు అవసరం మేర యూరియాను పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.