జగిత్యాల : సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండల పోరండ్ల గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో రూ.23 లక్షలతో 300 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుందన్నారు.
రైతుబంధు,రైతుబీ వంటి పథకాలతో అన్నదాతలకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత, ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, కల్లెడ ప్యాక్స్ చైర్మెన్ సందీప్ రావు ,మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం తదితరులు పాల్గొన్నారు.