NEET UG 2026 | నీట్ యూజీ 2026 నోటిఫికేషన్ విడుదల.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం
NEET UG 2026 : వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నీట్-యూజీ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
NEET UG 2026 : వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నీట్-యూజీ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులు, బీవీఎస్సి, ఏహెచ్, బీహెచ్ఎంఎస్తోపాటు బీఎస్సీ నర్సింగ్ (ఎమ్మెన్నెస్) వంటి కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.
నేటి నుంచి నీట్ రిజిస్ట్రేషన్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తమ సైట్ neet.nta.nic.in లో ప్రారంభించింది. నెల రోజులపాటు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే వచ్చే మార్చి 8, రాత్రి 9 గంటలవరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఫీజు చెల్లించేందుకు అదే రోజు రాత్రి 11.50 గంటల వరకు అవకాశం ఉంది. అప్లికేషన్లలో పొరపాట్లు సరిదిద్దుకునేందుకు మార్చి 10-12 వరకు అవకాశం ఉంది. మే 3న, ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
🚨 NEET (UG) 2026: New Application Rules 🩺
The NTA has updated the registration process with key security features:
Aadhaar eKYC: Now required for identity verification.
Live Photo: You must capture a live photo during submission, which is compared to your Aadhaar photo.
City… pic.twitter.com/k7Zh6xkbcv— National Testing Agency (@NTA_Exams) February 8, 2026
మూడు గంటలపాటు జరిగే ఈ పరీక్షను పెన్నుతో రాయాల్సి ఉంటుంది. 13 భాషల్లో కావాల్సిన భాషను ఎంపిక చేసుకోవచ్చు. విదేశాల్లోనూ పరీక్ష జరుగుతుంది. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

