కథలాపూర్, జూలై 22: కాళేశ్వరం జలాలను విడుదల చేసి వరద కాలువను నీటితో నింపాలని కథలాపూర్ (Kathalapur) రైతులు డిమాండ్ చేశారు. కథలాపూర్ మండల కేంద్రంలో రైతులు మహా ధర్నా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు మండల కేంద్రనికి చేరుకొని బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. రైతులు పంటలు సాగుచేసిన సమయంలో నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని వెంటనే వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని లేకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి కాలేశ్వరం జలలను విడుదల చేసి వరద కాలువను నీటితో నింపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, మాజీ జెడ్పిటిసి నాగం భూమయ్య, నాయకులు రైతు సంఘాల ప్రతినిధులు కంటె సత్యనారాయణ, గుండారపు గంగాధర్, ఎండి రఫీ, పిడుగు ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.