మల్లాపూర్ జూన్ 25 : కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. తాజాగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో గ్రామానికి చెందిన 276 మంది రుణమాఫీ కానీ రైతులు అందరూ కలిసి వినూత్నంగా అయ్యా సీఎం సారు మాకేదీ రుణమాఫీ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి బుధవారం గ్రామపంచాయతీ ఎదుట ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో 276 మంది రైతులకు రుణమాఫీ ఇప్పటికి జరగలేదని, ప్రభుత్వం రుణమాఫీ లబ్ధిదారుల జాబితా అంటూ గ్రామపంచాయతీ కార్యాలయ బయట ప్లెక్సీలను ఏర్పాటు చేయడం సరికాదని, తమలాంటి రైతులకు రుణమాఫీ ఎందుకు ఇవ్వరో చెప్పాలని డిమాండ్ చేశారు.