Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం, జూన్ 03 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకోవడం తప్ప రైతులకు చేసింది ఏం లేదని ఇబ్రహీంపట్నం రైతులు వాపోతున్నారు. రైతులకు అందుబాటులో యూరియా లేకపోవడం మొక్కజొన్న పంటకు మందు పెట్టే సమయం మించిపోతుండడంతో రైతులు ఆందోళన గురవుతున్నారు. కాగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని సహకార సంఘానికి బుధవారం రాత్రి 450 యూరియా బస్తాలు రావడంతో గురువారం ఉదయం ఐదున్నర గంటల నుండి సహకార సంఘం ఎదుట సుమారు 550 మంది రైతులు నుండి పడిగాపులు కాచారు. సహకార సంఘం నిర్వాహకులు ఒక్కొక్క రైతుకు మూడు బస్తాల చొప్పున యూరియాను అందించారు. మిగతా రైతులు వెనుదిరిగారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని ఆగ్రం వ్యక్తం చేసుకుంటూ వెళ్ళిపోయారు.