జగిత్యాల, మార్చి 18 : జగిత్యాల రూరల్ మండలం హైదర్పల్లి గ్రామంలో నీళ్లు లేక ఎండిపోయిన పంట పోలాలను మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత(Dava Vasantha) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండిపోయిన పొలాలకు మొరపెల్లి d53 కెనాల్ నుంచి నీళ్లు వెంటనే విడుదల చేసి కొన ఊపిరితో ఉన్న పొలాలను కాపాడాలన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ ప్రజా పాలనలో రాష్ట్రంలో సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్న కనీసం పట్టించుకునే నాధుడే లేడన్నారు. ఈ చేతగాని ప్రభుత్వంలో రైతన్నల జీవితం అస్తవ్యస్తమైందని అన్నారు.
కేసీఆర్ ఉన్నపుడు మండుటెండల్లో కూడా చెరువులు మత్తడి దూకాయని, మళ్లీ కేసీఆర్ వస్తేనే రైతు జీవితాలు బాగుపడతాయని రైతన్నలు ఆవేదనతో అంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రూరల్ మండల అధ్యక్షుడు ఆనంద రావు, మాజీ సర్పంచ్ అంజయ్య, సీనియర్ నాయకులు గంగారెడ్డి, ఉప సర్పంచ్ గంగాధర్, నాయకులు రాజేష్, శంకర్, దుబ్బరాజం, వోడ్నల వెంకన్న, రాములు, జంకుల వెంకటి లైశెట్ట్ వెంకటేష్ అద్దిరెడ్డి, శేఖర్, భూమయ్య, మహిపాల్, ప్రవీణ్, రాజ్ కుమార్, మహేందర్, రవి, భీమయ్య, గంగాధర్, గంగారెడ్డి, రాజం, వెంకటేష్, కళ్యాణ్, గంగన్న, రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.