Pit | కోరుట్ల, మే 27 : కోరుట్ల పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారిపై గుంతను తవ్వి నెల రోజులు గడిచినా దాన్ని పూడ్చడం మాత్రం మర్చిపోయారు. పట్టణంలోని వేములవాడ రోడ్డులో నెల రోజుల క్రితం మిషన్ భగీరథ పైప్ లైన్ దెబ్బ తినడంతో వాటర్ లీకేజీ జరిగింది. రహదారి మధ్యలో మరమ్మతు పనుల కోసం పెద్ద గుంతను తవ్వారు.
మరమ్మతులు చేసిన తర్వాత పూడ్చి వేయాల్సిన గుంతను నిర్లక్ష్యంగా వదిలేశారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే రహదారిపై పెద్ద గుంత ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రహదారి మధ్యలో ఉన్న గుంతకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో రోడ్డు ఇరుకుగా మారి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు.
సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి గుంతను పూడ్చివేయాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.
Rains | హైదరాబాద్కు నేడు నైరుతి.. ఎప్పుడైనా భారీ వర్షం కురిసే అవకాశం..!
Metuku Anand | కేటీఆర్కు ఏసీబీ నోటీసులు.. కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం : మెతుకు ఆనంద్
US Visa | క్లాస్లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ కీలక హెచ్చరికలు