Farmer Training Camp | జగిత్యాల, మే 16 : జగిత్యాల మండలంలోని తాటిపెళ్లి సురభి గోశాల ఆధ్వర్యంలో రైతులకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై ఒక రోజు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు గోశాల అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ తురగ రాజిరెడ్డి, బండారి కమలాకర్ రావులు తెలిపారు. ఈ నెల 18 ఆదివారం ఉదయం 8.00 నుండి సాయంత్రం వరకు సురభి గోశాల ఆవరణలో ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దేశ సౌభాగ్యం, సామాన్య ప్రజల ఆరోగ్యం, ఆర్థిక వికాసం, పర్యావరణ పరిరక్షణ కోసం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో అనంతపూర్‌కు చెందిన దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ శిక్షణ నిపుణులు నాగరాజు , ప్రకృతి వ్యవసాయ రైతు, శిక్షకులు రవీంద్ర నాయక్, మురళీధర గోశాల నిర్వాహకులు చెన్నమనేని పద్మ, గ్రామ వికాస ప్రాంత సంయోజకులు జిన్నా సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
ఈ శిక్షణ కార్యక్రమానికి ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి గల రైతులు సతీసమేతంగా హాజరై.. శిక్షణ పొంది సమాజానికి రసాయనాలు లేని సహజ సిద్ధమైన ఆహార ఉత్పత్తులను అందించాలని కోరుతున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9440950647 నెంబర్‌కు సంప్రదించాలని కోరారు.
Read Also :
Water tank | పాఠశాలలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్.. భయందోళనలలో విద్యార్థులు
Badibata program | నిజాంపేట మండల వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం
Huge Donation | తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త గోయాంక భారీ విరాళం