KCR | తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ (KCR)దేనని జడ్పీ మాజీ చైర్మెన్ దావా వసంత అన్నారు. సారంగాపూర్ మండలంలోని ధర్మానాయక్ తాండ గ్రామంలో ఆమె సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని వారి విగ్రహానికి పూజలు చేశారు.
అనంతరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు జన్మదినోత్సవంలో భాగంగా వృక్షోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంత్ సేవాలాల్.. మహరాజ్ హింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శ పురుషుడయ్యారు.
సేవాలాల్ మహరాజ్ ఆనాడు బంజారా జాతి పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు తెలు రాజు, మండల ధర్మనాయక్ తండా మాజీ సర్పంచ్ సంతోష్, యూత్ అధ్యక్షులు మదన్ సిలివెరీ, నాయకులు సాంబారి గంగాధర్, ఎండబెట్ల ప్రసాద్, అనంతుల గంగారెడ్డి, వెంకటేష్, గంగాధర్, గిరిజనులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Government Hospital | రికార్డ్ బ్రేక్.. 5 రోజుల్లో 200 సర్జరీలు