రామగిరి: మంథనిలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ను యదేచ్ఛగా ఉల్లంఘిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. రామగిరి మండలంలోని నాగేపల్లి, బేగంపేట్ తదితర ప్రభుత్వ పాఠశాలల్లో మంత్రి శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీనుబాబు జన్మదినం సందర్భంగా సోమవారం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్బంగా హైదరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలో చెట్లు నాటితేనే ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేసిన అధికారులు కాంగ్రెస్ ఉల్లంఘనలకు మాత్రం వత్తాసు పలుకుతున్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకలకు కోడ్ ను అడ్డుగా చూపిన అధికారులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లాంఘిస్తున్నా సహకరించడంపై కలెక్టర్కు, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు రామగిరి బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.