సారంగాపూర్, ఆగస్టు 12 : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో ఎమ్మెల్యే సంజయ్ రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రైతువేదికలో బైఠాయించారు.
ఒరిజినల్ కాంగ్రెస్, డూప్లికేట్ కాంగ్రెస్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఒరిజనల్ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ కండువాలు వేసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, పోలీసులు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొండ్రా రాంచందర్ రెడ్డి, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.