జగిత్యాల, మార్చి 05 : జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతత వాతావరణంలో జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బి.సత్య ప్రసాద్(Satya Prasad) అన్నారు. జిల్లా కేంద్రంలోని అల్పోర్స్ జూనియర్ కాలేజీ, ఎస్ కె ఎన్ ఆర్, బాలికల కళాశాల, శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ, ఎన్ఎస్వీ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల సెంటర్లను కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం విద్యార్థులు 14,450 మంది ఇంటర్ పరీక్షలు రాస్తున్నారని, వీరి కోసం 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాలు ప్రాంతాలలో BNS యాక్ట్ (144) సెక్షన్ అమలు ఉంటుందని తెలిపారు. ఒక నిమిషం ఆలస్యాన్ని సవరిస్తూ తాజాగా 5 నిమిషాలకు సడలిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. కలెక్టర్ వెంట, ఇంటర్మీడియట్ అధికారి నారాయణ, తహసీల్దార్ రామ్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.