జగిత్యాల : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా సారంగాపూర్ మండల బీజేపీకార్యదర్శి అనంతుల స్వామి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరారనన్నారు. కార్యక్రమంలో సారంగాపూర్ టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుర్రాల రాజేందర్ రెడ్డి, సర్పంచ్ ఢిల్లీ రామారావు, సీనియర్ నాయకులు సిరిగిరి రాజిరెడ్డి, నాయకులు భాస్కర్ ,సుమన్, తదితరులు ఉన్నారు.