జగిత్యాల : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం సారంగాపుర్ మండల్ లచ్చక్కపేట్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు మాజీ ఉప సర్పంచ్ రాగుల రాజయ్య, గ్రామ కాంగ్రెస్ నాయకులు 20 మంది ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుటామన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమణ రావు, వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్, సారంగాపూర్ మండల రైతు బంధు కన్వీనర్ శ్రీనివాస్, నాయకులు గంగారెడ్డి,రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.