ఎర్రటెండలో ప్రయాణికులు
గ్రేటర్లో సరిపడా బస్సు షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు రోడ్లపై ఎండలోనే నిల్చోవాల్సి వస్తున్నది. సాధారణంగా గ్రేటర్లో 6 వేల బస్సులు అవసరముందని రవాణా రంగ నిపుణులు ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు.
- సిటీలో బస్సు షెల్టర్లు కరువు
సిటీబ్యూరో: గ్రేటర్లో సరిపడా బస్సు షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు రోడ్లపై ఎండలోనే నిల్చోవాల్సి వస్తున్నది. సాధారణంగా గ్రేటర్లో 6 వేల బస్సులు అవసరముందని రవాణా రంగ నిపుణులు ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు.
అయితే ప్రస్తుతం నగరంలో సుమారు 2800 బస్సులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతీ రోజు 24 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. అయితే ప్రయాణికులకు సరిపడా బస్సు షెల్టర్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదువుతున్నాయి. కేవలం వాణిజ్య ప్రకటనలు వచ్చే అవకాశం ఉన్న చోట మాత్రమే అధికారులు షెల్టర్ల ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం గ్రేటర్లో 1370 బస్షెల్టర్లు మాత్రమే ఉన్నాయి.
వీటి సంఖ్య పెంచాలని మరో 400కు పైగా కొత్త షెల్టర్లు నిర్మాణం అవసరం ఉందని ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం భావించింది. ఉప్పల్, మెహిదీపట్నం, ఎల్బీనగర్, కోఠి, మియపూర్ సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో బస్ షెల్టర్లు అత్యవసరం. అందులో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులకు ఆర్టీసీ విన్నవించింది. అత్యవసరంగా 120 షెల్టర్లు నిర్మాణం పూర్తి చేయాలని ఆర్టీసీ అధికారులు కోరారు. అత్యవసరంగా నిర్మించాల్సిన ఆ షెల్టర్లను కూడా జీహెచ్ఎంసీ విస్మరించిందని విమర్శలు వస్తున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

