Bhoodan lands | వెలుగుమట్ల ఘటనపై పౌర హక్కుల సంఘం ఆరా..కక్షపూరితంగానే ఇండ్లు కూల్చివేశారని ఆరోపణ
ఖమ్మంలోని వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేత ఘటనపై పౌర హక్కుల సంఘం నాయకులు ఆరా తీశారు. రాష్ట్ర పౌర హక్కుల సంఘం, ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ నాయకులు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని శనివారం సందర్శించారు. చిన కమిటీ భూదాన్ బాధితులను కలిసి వివరాలను సేకరించారు.
- భూదాన్ భూములను పరిశీలించిన సంఘం నాయకులు
- కక్షపూరితంగానే ఇండ్లు కూల్చివేశారని ఆరోపణ
రఘునాథపాలెం, మార్చి 7 : ఖమ్మంలోని వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేత ఘటనపై పౌర హక్కుల సంఘం నాయకులు ఆరా తీశారు. రాష్ట్ర పౌర హక్కుల సంఘం, ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ నాయకులు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని శనివారం సందర్శించారు. చిన కమిటీ భూదాన్ బాధితులను కలిసి వివరాలను సేకరించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎన్ నారాయణరావు, కోశాధికారి విప్లవకుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కక్షపూరితంగానే పేదల ఇండ్లను కూల్చినట్టు నిర్ధారణ అయ్యిందని అన్నారు. నిర్వాసిత ప్రజలకు తిరిగి వెలుగుమట్ల వినోభానగర్ కాలనీలోనే పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూదాన్ బోర్డు జారీచేసిన పత్రాలను గౌరవించాలని ప్రభుత్వానికి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

