జగిత్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి రైతు మృతి చెందాడు. ఈ విషాదక సంఘటన రాయికల్ మండలం ఇటిక్యాలలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన గడ్డం రాజారెడ్డి(62) అనే రైతు పిడుగుపాటుతో మృతి చెందాడు. ఉదయం ఏడు గంటల సమయంలో వర్షం కురుస్తున్నప్పటికి పొలానికి నీళ్లు పెట్టాలని పొలం వద్దకు వెళ్లాడు.
పిడుగు పడటంతో రాజారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజారెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.