Collector Pamela Satpathy | కరీంనగర్ కలెక్టరేట్ , ఏప్రిల్ 8 : పోషకాహార ప్రాముఖ్యతపై ఈనెల 22 వరకు నిర్వహించనున్న పోషణ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమాల నిర్వహణపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. పోషకాహారం ప్రాముఖ్యతపై విద్యార్థులకు క్విజ్, రంగోలి, వ్యాస రచన పోటీలు నిర్వహించాలని తెలిపారు. యూనిసెఫ్ సహకారంతో పరిశుభ్రత, ప్లాస్టిక్ వాడకం వల్ల అనర్థాలపై అవగాహన కల్పించాలని అన్నారు.
హెల్త్, యోగా క్యాంపులు ఏర్పాటు చేయాలని.. బరువు తక్కువగా ఉన్న పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైతే ఆ పిల్లలను ఎన్ఆర్సీకి రెఫర్ చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని, పోషకాహార వంటల పోటీలు ఏర్పాటు చేయాలని అన్నారు.
అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. గర్భిణిగా ఉన్నప్పటినుండి శిశువు జన్మించిన తర్వాత గల వెయ్యి రోజుల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని అన్నారు. పోషణ పక్షం కార్యక్రమాలను ప్రతిరోజు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. గృహ సందర్శనల ద్వారా పోషకాహార ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని తెలిపారు. అనంతరం పోషణ పక్షం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సబిత, మెప్మా పీడీ వేణుమాధవ్, డిటిడిఓ పవన్ కుమార్, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్ ప్రకాష్ పాల్గొన్నారు.
Shadnagar | రెండు గంటలైనా రాని 108 అంబులెన్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Kunal Kamra | కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట
KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేస్తాం : కేటీఆర్