Collector Pamela Satpathy | హుజురాబాద్ రూరల్, జూన్ 04 : హుజురాబాద్ పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఆస్పత్రిలోని అన్ని వార్డులను పరిశీలించారు. . అనంతరం వైద్యసిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతిరోజు ఎన్ని ఓపీలు చూస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు.
ఆస్పత్రికి వచ్చిన రోగులకు అందుబాటులో వైద్యులు ఉండి చికిత్సలు నిర్వహించాలని చెప్పారు. ఆస్పత్రి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వైద్యుల కొరత, మంచినీటి సమస్యతోపాటు మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తలేరని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.. స్పందించిన కలెక్టర్ చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డ్ కు తరలించాలని కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
మంచినీటి సమస్య, వైద్యుల కొరతను త్వరలోనే తీరుస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారి చంద్రశేఖర్. ఏరియా ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి నారాయణరెడ్డి, వైద్యులు తదితరులు ఉన్నారు.
ACB Summons: 2 వేల కోట్ల స్కామ్‌లో సిసోడియా, సత్యేంద్రకు ఏసీబీ సమన్లు
MLC Kavitha | కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే నోటీసులు.. రేవంత్ సర్కారుపై కవిత ఫైర్..
Karimnagar | తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. నగదు, బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లిన దొంగలు